PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

10వ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ , ఎస్పి

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ ఇతర అవకతవకలు జరగకుండా పటిష్టంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల పట్టణంలోని గురురాజా ఇంగ్లీషు మీడియం స్కూల్, గుడ్ షెఫర్డ్ ఇంగ్లీషు మీడియం, సెయింట్ జోసఫ్, హోలీ క్రాస్ పాఠశాలల్లో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాల‌ను జిల్లా ఎస్పి కె. రఘువీర్ రెడ్డి తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తూ 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా పక్డబందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి కాలుక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, ఏ ఇతర ఎలక్రానిక్ వస్తువులను అనుమతించరాదన్నారు. ఇన్విజిలేటర్ల మొబైల్ ఫోన్లు కూడ బయటే డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారూ. పరీక్షా కేంద్రాల సమీప ప్రదేశాల్లో 144 సెక్షన్ అమలు పరచడంతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అవకతవకలు జరగకుండ ముందస్తు జాగ్రత్తలు కలెక్టర్ ఆదేశించారు.

About Author