PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న కాలనీ లే అవుట్ లో ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్

1 min read

– వారం రోజుల్లో స్టేజ్ కన్వర్షన్ పనులలో పురోగతి సాధించేలా చర్యలు చేపట్టండి
– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వారం రోజుల్లో స్టేజ్ కన్వర్షన్ పనులలో పురోగతి సాధించేలా చర్యలు చేపట్టాలని హౌసింగ్ అధికారులను, మండల స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంపిడిఓ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.శనివారం గూడూరు మండలం నాగలాపురం గ్రామములోని నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీ లే అవుట్ లో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలాపురం గ్రామంలోని జగనన్న కాలనీ లే అవుట్ లో ఇంకా ఇళ్ళ నిర్మాణం మొదలు పెట్టని 6 మంది లబ్ధిదారులతో మాట్లాడుతూ ఎస్ హెచ్ జి గ్రూప్ ల ద్వారా ఇళ్లు నిర్మించుకోవడానికి రుణాలు మంజూరు అయినా ఎందుకు కట్టుకోవడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక, స్టీల్, సంఘాలకు రుణాలు ఇచ్చినప్పటికీ ఇళ్లు నిర్మించుకోవడం లేదని, రుణాలను ఇతర పనుల కోసం కాకుండా ఇళ్ళ నిర్మాణం కోసం ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు. వారంలోపు మీరు ఇళ్ళ నిర్మాణం పనులు మొదలు పెట్టాలని, నిర్మాణం మొదలు పెట్టకుంటే ప్లాట్లు రద్దు చేయిస్తానని జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు తెలిపారు. లబ్ధిదారులను మోటివెట్ చేసి ఇళ్ళ నిర్మాణం వారం రోజుల్లో మొదలు పెట్టించేలా చర్యలు తీసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్, హౌసింగ్ అధికారులను మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నాగలాపురం గ్రామము జగనన్న కాలనీ లే అవుట్ లో మంజూరైన ఇళ్ల నిర్మాణాల గురించి హౌసింగ్ ఈ ఈ ని అడగగా మొత్తం 82 ఇళ్లు మంజూరు చేశామని వాటిలో రూఫ్ కాస్ట్ 01 ఇళ్లు, రూఫ్ లెవెల్ 04 ఇళ్లు, బేస్మెంట్ లెవెల్ 58 ఇళ్లు బిలో బేస్మెంట్ లెవెల్ 08, పూర్తి అయిన ఇళ్లు 11 ఉన్నాయని హౌసింగ్ ఈ ఈ జిల్లా కలెక్టర్ గారికి వివరించారు. బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్ళ నిర్మాణాలు వారంలోపు స్టేజ్ కన్వర్షన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. అక్కడ ఉన్న లబ్ధిదారులు నీటి సమస్య గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా ఇళ్ళ నిర్మాణాలు పూర్తైన ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి హౌసింగ్ ఈ ఈ ని అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ నాగరాజు, మండల స్పెషల్ ఆఫీసర్ సబిహా పర్వీన్, గూడూరు తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో మాధవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author