పోలింగ్ బూత్లను పరిశీలించిన రిటర్నింగ్ ఆఫీసర్.. నారపరెడ్డి మౌర్య
1 min read
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని గని మంచాలకట్ట గడివేముల పెసరవాయి గ్రామాలలో సోమవారం నాడు రిటర్నింగ్ ఆఫీసర్ నారపరెడ్డి మౌర్య. ఎన్నికల కోసం కేటాయించిన పోలింగ్ బూత్లను పరిశీలించారు. గడివేములలో 306 బూతు నెంబర్లో వసతులు సరిగా లేవని సంబంధిత అధికారులు రెండు రోజుల్లో బూతులను మరమత్తు చేయించాలని ఆదేశించారు అలాగే సమస్యాత్క పోలింగ్ స్టేషన్లను పర్యటించి పరిశీలించారు మంచాలకట్ట .పెసరవాయి. చిందుకూరు. దుర్వేసి.గని. గ్రామాలలో పరిశీలించి అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓ జమనుల్లా ఖాన్. ఏం సి సీ అధికారి శివరాం రెడ్డి. డిటి గుర్నాధం. ఆపరేటర్ సూరి. బిఎల్వోలు అధికారులు పాల్గొన్నారు.