PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భద్రత ఏర్పాట్లను పరిశీలించిన.. ఎస్పీ : కలెక్టర్

1 min read

పల్లెవెలుగు ,వెబ్​ ఓర్వకల్: ఈనెల 17వ తేదీన ఆళ్లగడ్డ లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఏర్పాట్లను శనివారం పరిశీలించిన… జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఎయిర్ పోర్ట్ లో భద్రత ఏర్పాట్ల ను పరిశీలించారు.ఈ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు కాన్వాయ్, అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్, డాక్టర్లు,విద్యుత్ సరఫరా, పరిశుభ్రత, తదితర అన్ని రకాల ఏర్పాట్లపై అధికారులనుఅడిగితెలుసుకున్నారు.ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్ వెంట కర్నూలు ఆర్డీవో హరి ప్రసాద్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ విద్యా సాగర్,డి పి ఓ నాగరాజు నాయుడు, డిఎంహెచ్వో రామ గిడ్డయ్య, కర్నూల్ పట్టణ డిఎస్పి కె వి మహేష్, సీఐ లు ఓర్వకల్ ఎస్సై మల్లికార్జున, ఎస్పీ డీసీఎ ల్, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author