మండల వ్యాప్తంగా 36 పోలింగ్ స్టేషన్లో తనిఖీ
1 min read– నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్టర్ అధికారి చంద్రమోహన్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండల వ్యాప్తంగా ఉన్నటువంటి 36 పోలింగ్ స్టేషన్లను శుక్రవారం నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్టర్ అధికారి చంద్రమోహన్ పరిశీలించారు, అక్కడ త్రాగునీటి సమస్య, కరెంటు సమస్య, ఫర్నిచర్ సమస్య లేకుండా చూడాలని తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్ కు సూచించారు, అదేవిధంగా మండలంలో జరుగుతున్న నాడు నేడు పనులను త్వరగ తిన పూర్తిచేయాలని మండల విద్యాశాఖ అధికారి ఎం గంగిరెడ్డి నీ ఆదేశించడం జరిగింది, అలాగే చెన్నూరు లో మరీ చిన్నగా ఉన్న రెండు పోలింగ్ స్టేషన్లను గుర్తించడం జరిగిందని అవి చెన్నూరు పార్కు వద్ద( జిపిఎస్) ఉన్న 68వ పోలింగ్ స్టేషన్గ, తాసిల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న 65, 66 పోలింగ్ స్టేషన్ సచివాలయం-2 లోకి మార్చే విధంగా కలెక్టర్ కు నివేదికలు పంపడం జరిగిందని ఎలక్ట్రోల్ రిజిస్టర్ అధికారి చంద్రమోహన్ తెలిపారు, కాగా 65, 66 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 2 వేల మంది కి పైగా ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు, జనాలు ఎక్కువగా ఉండడం ఒకే దారి ఉండడం, తో ఆ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి మార్చాలని ఆయన ఉన్నత అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు, కార్యక్రమంలో తాసిల్దార్ మహమ్మద్ పటాన్ అలీ ఖాన్, డిప్యూటీ తాసిల్దార్, బి ఎల్ వో లు, సూపర్వైజర్లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.