PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ సర్వజన వైద్యశాల జీవందన్ వైద్య నిపుణుల కమిటీ సభ్యుల తనిఖీ

1 min read

– అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల జీవందన్ వైద్య నిపుణుల బృందం పలు ఓటీలు నెఫ్రాలజీ ఓటి, యూరాలజీ ఓటి మరియు కార్డియోథొరాసిక్ సర్జరీ (CTVS) ఓటిలలో తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు.ఆస్పత్రిలో ఓటిల ఇన్‌స్పెక్షన్ కమిటీ పర్యటించారు అనంతరం సిబ్బందికి సంబంధించిన వివరాలు మరియు పారామెడికల్ సిబ్బంది, ప్రత్యేక సేవలు, ఆపరేషన్ థియేటర్లు, బ్లడ్ బ్యాంక్, పరికరాలు, మౌలిక సదుపాయాలు మరియు ఇతర సామాగ్రి మొదలైనవి, మరణించిన దాత కిడ్నీ, గుండె కోసం గుర్తింపు పునరుద్ధరణ కోసo & ఊపిరితిత్తులు మరియు లైవ్ డోనర్ కిడ్నీ మార్పిడి విషయాలపై ఆరా తీశారు.అవయవ మార్పిడి కేంద్రం (OTC) కమిటీ గుండె & ఊపిరితిత్తులు మరియు లైవ్ డోనర్ కిడ్నీ మార్పిడికి సంబంధించి కమిటీ ఇన్స్పెక్షన్ చేసినట్లు తెలిపారు. గుండె & ఊపిరితిత్తులు మరియు లైవ్ దాత కిడ్నీ మార్పిడి సంబంధించిన వాటికి తనిఖీ చేసి అనంతరం ఆసుపత్రి లో అనువుగా ఉందో సరిపడా పడకల బలం, నిపుణులైన వైద్యులు మరియు నైపుణ్యం కలిగిన సిబ్బంది ఉన్నారో లేదో వారి యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డా.రామ్, (జీవందన్ కమిటీ చైర్మన్) డైరెక్టర్-కమ్-వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ & హెచ్‌ఓడి ఆఫ్ నెఫ్రాలజీ & మెడికల్ సూపరింటెండెంట్, SVIMS, తిరుపతి, డా. అలోక్ సామంతరి, (జీవందన్ కమిటి సభ్యులు) అనస్థీషియాలజీ ప్రొఫెసర్ & హెచ్‌ఓడి, స్విమ్స్, తిరుపతి, డా.వినోద్‌ భాన్ (జీవందన్ కమిటీ సభ్యులు) HOD & CTVS సర్జరీ, SVIMS, తిరుపతి, డా.N.అనిల్ కుమార్, (జీవందన్ కమిటీ సభ్యులు) ప్రొఫెసర్ & HOD ఆఫ్ యూరాలజీ, SVIMS, తిరుపతి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO డా.హేమానలిని, హెచ్వోడీస్, డా.కొండారెడ్డి, డా.సీతారామయ్య, హాస్పిటల్ అడ్మిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, మరియు నర్సింగ్ స్టాఫ్, తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి, గారు తెలిపారు.

About Author