PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమస్యత్మక గ్రామాలలో తనిఖీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  కృష్ణ మండలం తెలంగాణ.. పోలీసులు కేంద్రం సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ  మాట్లాడుతూ…అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మరియు ప్రజలలో ఆత్మ విషయాన్ని విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని అలాగే ప్రజలందరికీ జిల్లా పోలీసులు ఎల్లవేళలా తోడుంటారని ప్రజల్లో ధైర్యాన్ని కల్పించడానికి  ప్లగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అని అదనపు ఎస్పీతెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు కీలకపాత్రను పోషిస్తాయని పోలింగ్ కేంద్రాల నందు సాయుద బలగాలతో కలిసి జిల్లా పోలీసు సిబ్బంది విధులను నిర్వహిస్తుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో SI సురేష్, కేంద్ర సాయుధ బలగాలు, పోలీసు సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.

About Author