ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆరోగ్యశ్రీ విభాగాల తనిఖీ
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ:కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు ఆరోగ్యశ్రీ విభాగాల తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని పేషంట్లలకు అందుతున్న ట్రీట్మెంట్ మరియు ఆరోగ్యశ్రీ చికిత్సల గురించి ఆరా తీశారు అనంతరం పేషంట్లతో మాట్లాడి వారికి అందుతున్న ట్రీట్మెంట్ మరియు ఆరోగ్యశ్రీ చికిత్సల గురించి ఆరా తీశారు.ఆసుపత్రిలో అన్ని ఆరోగ్యశ్రీ విభాగాలకు నేమ్ బోర్డులు పెట్టాలని సిబ్బందికి ఆదేశించారు.ఆరోగ్యశ్రీ సిబ్బంది ఎప్పటికప్పుడు పేషెంట్స్ యొక్క డేటా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.ఆసుపత్రిలో ఉన్న అన్ని విభాగాలకు ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు,ఆరోగ్యశ్రీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు తెలిపారు.