కైలాసద్వారం వద్ద ఏర్పాట్ల పరిశీలన
1 min readశ్రీశైల క్షేత్రం లో జరుగుతున్న ఉగాది మహోత్సవాలలో కర్ణాటక మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో భక్తులు పాదయాత్రతో శ్రీశైలక్షేత్రాన్ని చేరుకుంటున్నారు.
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: అడవిమార్గం గుండా పాదయాత్రతో వచ్చే భక్తుల కోసం అటవీశాఖ, మరియు వైద్యఆరోగ్యశాఖ సమన్వయముతో పలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా అడవి మార్గం ద్వారా పాదయాత్ర చేసేభక్తులకు. కైలాసద్వారం వద్ద భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేయడం జరిగింది. కైలాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా విశాలమైన తాత్కాలిక షెడ్డు నిరంతరం మంచినీటి సరఫరా కైలాస ద్వారం నుండి భీముని కొలిన వరకు తాత్కాలిక పైప్ లైన్ ద్వారా మంచినీటిని భక్తులకు అందుబాటులోకి ఆలయ ఇంజనీరింగ్ అధికారులు. భక్తులకు అందుబాటులో ఉంచారు ఆలయ ఈవో పెద్దిరాజు ఈఈ రామకృష్ణ భీముని కొలను మెట్ల మార్గం వద్ద ఏర్పాటు పర్యవేక్షించారు కైలాస ద్వారం వద్ద కన్నడ భక్తులు నిర్వహిస్తున్న అన్నదాన శిబిరాన్ని పరిశీలించిశుచీశుభ్రతలను పాటించాలన్నారు. ముఖ్యంగా ఆహారపదార్థాలపై ఎప్పటికప్పుడు మూతలు పెడుతుండాలన్నారు.అన్నదాన నిర్వహణకు చలువపందిర్లు ఏర్పాటు, మంచినీటిసరఫరా, మజ్జిగ సరఫరా, విద్యుద్దీకరణ మొదలైన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు. కైలాసద్వారం వద్ద తగినంత పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని దేవస్థానం పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. పాదయాత్రతో వచ్చే పలువురు భక్తులతో ముఖాముఖిగా ఈవో పెద్దిరాజు సంభాషించారు. కాలిబాటలోని ఏర్పాట్ల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు అందరు కూడా ఆయా ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.