NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సరిహద్దు చేక్​పోస్టు డిఐజి పరిశీలన

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ: సాధారణ అసెంబ్లీ ఎన్నికలు 2023 సందర్భంగా నారాయణపేట జిల్లాకు పోలీస్ అబ్జర్వర్ గా వచ్చిన DIG. శ్రీ ద్రువ్ ఐపీఎస్ఈ రోజు ఉదయం కృష్ణ మడలంలోని సరిహద్దు రాష్ట్ర చెక్పోస్టులను పరిశీలించారు. అక్కడ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, ఎక్సైజ్, రెవెన్యూ అధికారులు ఏ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారు.  వాహనాల తనిఖీలు ఏ విధంగా చేస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని అడిగి తెలుసుకొని వాహనాల తనిఖీ రిజిష్టర్ ను పరిశీలించారు. అనంతరం మక్తల్ లోని  EVM స్ట్రాంగ్ రూము దగ్గర గల పోలీసు భద్రతను పరిశీలించారు.  DIG తనిఖీ సమయంలో సిఐ రామ్ లాల్, SI విజయ్ భాస్కర్ ఉన్నారు.

About Author