మూడు గ్రామాలలో సిసి రోడ్ల తనిఖీ
1 min readపల్లెవెలుగు వెబ్ రుద్రవరం: మండలంలోని యర్రగుడిదిన్నె చిలకలూరు నల్లవాగుపల్లె గ్రామాలలో 20.70 లక్షల సిఆర్డిఎఫ్ నిధులతో చేపట్టిన సిసి రోడ్లను బుధవారం క్వాలిటీ కంట్రోల్ డి ఈ మోహన్ రావు తనిఖీ చేశారు.యర్రగుడిదిన్నె గ్రామంలో 5.70 లక్షలతో చిలకలూరు గ్రామంలో పది లక్షలతో నల్లవాగుపల్లి గ్రామంలో ఐదు లక్షలతో సిసి రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. సిసి రోడ్లను తనిఖీ చేసి కోరి యంత్రంతో శాంపిల్స్ సేకరించామని సేకరించిన శాంపిల్స్ నమూనాలను ల్యాబ్ కు పంపడం జరుగుతుందని క్వాలిటీ కంట్రోల్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ ఏఈ అయాజ్ పంచాయతీరాజ్ డిఇ నరసింహులు ఏఈ వెంకటరాముడు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు.
గడపగడప సమస్యల పరిశీలన
మండల కేంద్రమైన రుద్రవరం గ్రామపంచాయతీ మజరా గ్రామం తువ్వపల్లె గ్రామంలో సమస్యలను పంచాయతీరాజ్ డిఇ నరసింహులు బుధవారం పరిశీలించారు. గడప గడప కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరడంతో వాటిని పరిష్కరించేందుకు పరిశీలించి ప్రతిపాదన నివేదికలను సిద్ధం చేసి పంపాలని ఏఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సూచించారు. అలాగే ఆర్ కొత్తపల్లె గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరవడంతో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు పరిశీలించారు. ఆయన వెంట ఏఈ వెంకటరాముడు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు.