NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన వైద్య కళాశాల నిర్మాణ పనులు పరిశీలన..

1 min read

– సెప్టెంబరు 1న  వైద్య కళాశాల తరగతులు ప్రారంభానికి సిద్దం..

– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్.

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో నిర్మాణంలో ఉన్న నూతన వైద్య కళాశాల స్టూడెంట్స్ హాస్టల్ మరియు డియంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న  వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ శుక్రవారం పరిశీలించారు.  ఈసందర్బంగా (2023-24) సెప్టెంబరు 1వ తేదీనుండి యంబిబిఎస్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు తరగతులు ప్రారంభిస్తున్న దృష్ట్యా యుద్ధప్రాతిపదికన మెడికల్ కళాశాల,  హాస్టల్ నిర్మాణ పనులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో తరగతి గదులు, ల్యాబ్, అధునిక వసతులతో నిర్మించిన  ప్రొఫీసర్స్ గదులను, కిచెన్, హాస్టల్స్ రూమ్స్, టాయిలెట్స్, వాటర్ పైపింగ్ సిస్టం, ఎలక్ట్రిసిటీ తదితర నిర్మాణ ఏర్పాట్లు కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భవనాల నిర్మాణం 90 శాతం పూర్తయ్యాయని చిన్నచిన్న మైనర్ పనులు ఉన్నాయని అవి త్వరలో పూర్తవుతాయని తెలిపారు.  మెడికల్  కళాశాలలో 150 మంది విద్యార్ధులు చదువుకునే విధంగా భవనాల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.  అనంతరం డియంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు.  ఈ కార్యక్రమంలో ఎపియంఎస్ఐసిడిసి ఎస్ఇ డి. బలరామ్ రెడ్డి, డియంహెచ్ఓ డా. ఆశ, సూపరింటెండెంట్ శశిధర్, కాలేజి ప్రిన్సిపల్ డా. విజయకుమార్, నగరపాలక సంస్ధ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, డిఐఓ డా. నాగేశ్వరరావు, తహశీల్దారు సోమశేఖర్, తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author