మిచాంగ్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటల పరిశీలన
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలో మి చాంగ్ తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారి స్థానిక ప్రజా ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు, మండల వ్యాప్తంగా 250 ఎకరాలలో వరి, అలాగే 150 ఎకరాలలో జొన్న, 75 ఎకరాలలో మినుము పంటలు అధిక వర్షపాతం వలన దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్ అధికారులు ప్రాథమిక అంచనా వేయడం జరిగినది, చిన్నమచుపల్లి,ఉప్పరపల్లి గుర్రంపాడు, రాచిన్నాయపల్లి, ముండ్లపల్లి,శివాల పల్లి,చెన్నూరు తదితర గ్రామాలలో పంట నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు కాగా ఈ పంటలపై ప్రాథమికంగా అంచనా వేసి జిల్లా అధికారులకు తెలియజేయునన్నట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి, తెలిపారు, కార్యక్రమంలో మండల వ్యవసాయ సలహాదారులు ఎర్ర సాని మోహన్ రెడ్డి, తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్, మండల కో ఆప్షన్ నెంబర్ వారిష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.