సర్వజన వైద్యశాల జనరల్ సర్జరీ విభాగాల తనిఖీ
1 min read– అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు విభాగాలలో తనిఖీ నిర్వహించి అనంతరం సర్జికల్ విభాగం ఏబీఓటి లో ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రి సర్జికల్ విభాగం నందు ఏబీఓటి (ABOT) లో ఆకస్మిక తనిఖీ నిర్వహించగా శస్త్ర చికిత్స (సర్జికల్ ఎక్విప్మెంట్ ) స్టాక్ రిజిస్టర్ పరిశీలించి పరికరాల అదనంగా నిల్వ ఉంచడంపై అక్కడ ఉన్న హెడ్ సిస్టర్ మరియు నర్సింగ్ స్టాఫ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జరీ విభాగంలో హెడ్ సిస్టర్ మరియు నర్సింగ్ సిబ్బందిపై విచారణకు ఆదేశించారు.ఇలాంటి సంఘటన మళ్ళీ పున రావృతమైతే నర్సింగ్ సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సర్జికల్ ఎక్విప్మెంట్ అదానంగా ఉన్న వాటిని ట్యలిచేసి అనంతరం వారి యొక్క రికార్డును పరిశీలించి ఇమీడియట్గా స్టోర్ కి హ్యాండ్ ఓవర్ చేయాలని నర్సింగ్ సూపరిండెండెంట్ కి ఆదేశించారు.ఆస్పత్రిలోని పలు ఓటివిభాగాలను ప్రతి మూడు రోజులకు ఒకసారి తనిఖీ చేయాలని నర్సింగ్ సూపరిండెండెంట్ కి ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, అనస్థీషియా HOD, డా.కొండారెడ్డి, జనరల్ సర్జరీ HOD, డా.మాధవి శ్యామల, డా.కృష్ణ నాయక్, మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి, గారు తెలిపారు.