ఆరోగ్యకేంద్రాలు తనిఖీ… పరిశోధన కేంద్రం కేరళ టీం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం చాంబర్ లో డాక్టర్ బి రామగిడ్డయ్య ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఆఫీసర్ల మీటింగ్ జరిగినది ఈ మీటింగ్ నకు జనాభా పరిశోధన కేంద్రం కేరళ నుంచి ఇద్దరు టీం మెంబెర్స్ వారు డాక్టర్ రాజేష్ జె నాయక్ మరియు మానిటరింగ్ ఆఫీసర్ ఎన్ హెచ్ ఎం పి ఐ పి డాక్టర్ సచిన్ కె.వి పదవ తారీఖున వీరు ఈ తాండ్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గొందిపల్లి గ్రామాన్ని సందర్శించి స్కూలు అంగన్వాడి కేంద్రాన్ని విజిట్ చేశారు పిల్లలలో ఉన్న పెరుగుదల లోపాలను పరిశీలించారు మరియు అన్ని ప్రోగ్రాములను తనిఖీ చేశారు ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ ప్రోగ్రాంను మరియు ఎన్సీడీ స్క్రీనింగ్ లో జరిగిన పేషెంట్లకు ట్రీట్మెంట్ చాలా బాగుందని ప్రశంసించారు మరియు విప్స్ ప్రోగ్రాము వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ ఏరియా హాస్పిటల్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వైద్య సేవలు అన్ని బాగున్నాయని ప్రశంసించారు వీరు 11వ తారీఖున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రామగిడ్డయ్యని కలిసి ప్రోగ్రాం ఆఫీస్ అందరితోనూ మీటింగ్ లో పాల్గొన్నారు ఈ మీటింగ్ లో అన్ని ప్రోగ్రామ్స్ మీద వారికి మంచి అభిప్రాయం కలిగినది అని ప్రశంసించారు మరి ఈ కార్యక్రమంలో డిపిఎమ్ఓ డాక్టర్ ఉమా గారు ఫ్యామిలీ ఫిజీషియన్ కోఆర్డినేటర్ డాక్టర్ బాల మురళి కృష్ణ ఇన్చార్జి డిఏఓ డాక్టర్ సైలెస్ కుమార్ ఆర్ డి ఎస్ కే హేమలత జిల్లా మలేరియా అధికారి నూకరాజు మాస్ మీడియా అధికారి ప్రమీలమ్మ ఐ డి ఎస్ పి డాక్టర్ నాగ ప్రసాద్ డిప్యూటీ ఏమో చంద్రశేఖర్ రెడ్డి ఎన్హెచ్ఎం అకౌంట్స్ శర్మ డిపి ఓ విజయ రాజు ఎస్ హేమ సుందర్ ఏవో నాగమణి గారు తదితరులు పాల్గొన్నారు.