గుంటూరు–గుంతకల్ 2వ రైల్వేలైన్ కోసం నంద్యాల సబ్‌కలెక్టర్ భూసేకరణ ప్రాంతాల పరిశీలన
1 min readపల్లెవెలుగువెబ్, నంద్యాల సెప్టెంబర్ 18: గుంటూరు – గుంతకల్ 2వ రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రాంతాలను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ శనివారం పరిశీలించారు. ఈమేరకు మహానంది, నంద్యాల మండలాల పరిధుల్లో పర్యటించి గుంటూరు–గుంతకల్ రెండో రైల్వేలైన్ ఏర్పాటుకు అనువైన భూములను పరిశీలించారు. ఈమేరకు ఆయా ప్రాంతాల్లో భూములను సేకరించనున్నట్లు సబ్‌కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో మహానంది తహసిల్దార్ జనార్దనశెట్టి. నంద్యాల తహసీల్దార్ రవికుమార్, రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు. మండల సర్వేయర్ నాగశ్రీ, మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.గుంటూరు – గుంతకల్ 2వ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా భూసేకరణకు సంబంధించి మహానంది, నంద్యాల మండలాల్లోని గోపవరం గ్రామంలో 44 సెంట్ల స్థలాన్ని, నందిపల్లె గ్రామ సమీపంలో 63 సెంట్ల స్థలాన్ని, నంద్యాల మండలంలోని అయిలూరు గ్రామ సమీపంలో 17 సెంట్ల స్థలాన్ని పరిశీలించినట్లు వెల్లడించారు. ఈ భూములకు సంబంధించిన ప్రతిపాదనలను నివేదించాలని ఆయా మండలాల తహసిల్దార్లను ఆదేశించారు.