పోలింగ్ కేంద్రాల పరిశీలన
1 min readపల్లెవెలుగు వెబ్ చాగలమర్రి: చాగలమర్రి పట్టణంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆళ్లగడ్డ సెక్టోరియల్ అధికారి మురళి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్, నీటి సౌకర్యాలను పరిశీలించారు . చాగలమర్రి మండల వ్యాప్తంగా 1491 మంది. పట్టభద్రులు, 115 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు. 2కేంద్రాలు పట్టభద్రుల కోసం, ఒక పోలింగ్ కేంద్రం ఉపాధ్యాయుల కోసం పోలింగ్ బూతులు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు. ఆయన వెంట తహసీల్దారు. విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు కోటయ్య, మండల సర్వేయర్ కేశవరెడ్డి పాల్గొన్నారు.