స్మశాన స్థలం పరిశీలన
1 min readపల్లెవెలుగు వెబ్ రుద్రవరం: మండలంలోని యల్లావత్తుల గ్రామ సమీపంలో స్మశాన స్థలాన్ని పరిశీలించినట్లు తహాశీల్దార్ వెంకటశివ బుధవారం తెలిపారు. స్మశాన స్థలాన్ని కేటాయించాలని గ్రామస్తులు కోరిక మేరకు గ్రామానికి సమీపంలోని ఆర్ అండ్ బి రోడ్డు పక్కన ఉన్న సర్వే నంబర్ 106 లో స్మశానానికి స్థలం కేటాయించేందుకు పరిశీలించడం జరిగిందని అన్ని సమస్యలు పూర్తిచేసి గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తహాశీల్దార్ తెలిపారు. ఆయన వెంట వీఆర్వోలు మల్లేశప్ప వెంకటనారాయణ గ్రామ సేవకులు తదితరులు ఉన్నారు.