గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ..
1 min readపల్లెవెలుగు, వెబ్ మహానంది: మహానంది లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను నంద్యాల జిల్లా డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి వెంకట శివ ప్రసాద్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు .విద్యార్థుల అందిస్తున్న అల్పాహారాన్నిఉదయం ఆయన పరిశీలించారు .పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని మెనూ ప్రకారంఅందజేయాలని స్థానిక హెచ్ ఎం కు సూచించారు .లేకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు .విద్యార్థుల హాజరు తో పాటు ఉపాధ్యాయుల హాజరు పట్టీలను వారి పనితీరును నిశితంగా పరిశీలించి కొన్ని సూచనలు చేశారు .ఇప్పటికే పాఠశాలపై కొన్ని ఫిర్యాదులు అందాయని మరల పునరావృతం కాకుండా తీసుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం.