వాహనాల తనిఖీ
1 min read
పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : ఈనెల 13న జరిగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం చాగలమర్రి టోల్ ప్లాజా సమీపంలో పోలీసు బందోబస్తు నడుమ ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి శ్రీనివాస రెడ్డి వాహనాల తనిఖీ చేపట్టారు. స్థానిక టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీ కార్యక్రమాన్ని శుక్రవారం చేపటారు. నగదు,మద్యం తరలిపోకుండా ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ఓటర్లు సహకరించాలన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని తెలిపారు. ఆయన వెంట విఆర్వోలు, పోలీసులు పాల్గొన్నారు.