వాహనాల తనిఖీ.. జరిమాన
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మండలంలోని తమ్మడపల్లె , బొల్లవరం గ్రామాల మధ్య ఉన్న సూర్యనంది ఆర్చ్ గేటు వద్ద మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి వాహనాలను తనిఖీచేపట్టారు. పలువురి వాహనదారులకు జరిమానాలు విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనాలకు సంబంధించిన సరియైన పత్రాలు లేని వాటికి జరిమాణాలు విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని ఇలాంటి వారికి కోర్టులో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని ఎస్ఐ పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడిపిన కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.