NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రక్తదాతలకు స్ఫూర్తి.. డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్

1 min read

ఇప్పటికే 44సార్లు రక్తదానం చేసిన వైనం

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో:అన్నమయ్య జిల్లా లోని రాయచోటి పట్టణం నాయబ్ సబ్ వీధి కి చెందిన మైనుద్దీన్  రక్త దాతలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు . రాయచోటి  ప్రజల ఆపద్భాంధువుడు  ఇప్పటి వరకు దాదాపు 44 సార్లు రక్త దానం చేసి అంతటితో ఆగకుండా ఇప్పటి  దాక 25 వేల మంది యువకులచే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తధానము చేయించిన ఘనత ఆయనకే చెందుతుంది. అధే విధముగా వేసవి కాలములో ముందస్తు ఎండలు దృష్టిలో పెట్టుకొని యే ఒక్కరు ఆపద  సమయములో రక్తము  అంధక భాదపడకూడధని యువకులని ప్రేరెపించి  రక్త దానం చేయించి ప్రాణాలు కాపాడుతున్నాడు.ఇతను ఒక్కడే 1000 మంది కలిసి చేసే పని ఒక్కడే చేస్తాడు,ఒక సంస్థ ఫౌండేషన్ లు చేయని పని ఒక్కడే చేస్తాడు బ్లడ్ అవసరం అని కాల్ రాగానే క్షణాల్లో బ్లడ్ సరఫారా చేయడమే తన లక్ష్యామన్నారు.

About Author