NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువతకు స్ఫూర్తి .. వివేకానందుడు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: అవోపా‌ మరియు వివేకానంద రాక్ మెమోరియల్, కర్నూలు వారి సంయుక్త ఆధ్వర్యంలో అవోపా భవన్ లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  యువతే తన ఆశాజ్యోతి అంటూ.. యువతే నేటి భారతానికి మార్గదర్శి, గొప్ప ధృఢమైన సంకల్పంతో ముందుకు సాగినపుడు సమాజంలో సమస్యలు పరిష్కరింపబడి అసమానతలు దూరమవుతాయంటూ వివేకానందుడు చెప్పిన మాటలను వక్తగా విచ్చేసిన యస్బీహెచ్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్  యస్.వి.కె.మల్లికార్జునరావు తన ఉపన్యాసంలో చెప్పారు.  వివేకానందుని స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని  అవోపా అధ్యక్షులు గోనూరు యుగంధర్ శెట్టి , నేటి సమాజంలో వివేకానందుని ఆదర్శంగా తీసుకోవడమే యువత వివేకానందుని పట్ల కనబరచే శ్రద్ధాంజలి అంటూ వివేకానంద రాక్ మెమోరియల్ తరపున అధ్యక్షులు  శ్రీ పుల్లయ్య  తెలిపారు.  వివేకానంద రాక్ మెమోరియల్, కన్యాకుమారి  కర్నూలు శాఖ కన్వీనర్ శ్రీ శివప్రసాద్  కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, వివేకానంద కేంద్ర కార్యదర్శి, అవోపా చీఫ్ కన్వీనర్ శ్రీ నాగేశ్వరరావు గారు, పోలేపల్లి శేషయ్య నాగెళ్ళ హరికిషన్ కిరణ్ శశిధర్ సూర్యనారాయణ అవోపా మహిళామండలి.. లక్స్మిసుజాత.. మొదలగు వారు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

About Author