PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్ఫూర్తి నింపిన స్నేహితులు..

1 min read

– అన్ని తామై స్నేహితుని కుటుంబానికి తోడు
పల్లెవెలుగు వెబ్​, గడివేముల: సొంత వాళ్ళనే అవసరం తీరాక పలకరించని సమాజంలో స్నేహం కోసం కొండంతో అండగా నిలబడ్డ స్నేహితుల స్ఫూర్తికి పలువురు కొనియాడుతున్నార. మండలంలోని బూజునూరు గ్రామానికి చెందిన కరిముల్లా గత సంవత్సరము నవంబర్ లో అనారోగ్యంతో చనిపోవడంతో గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన తోటి స్నేహితులు గత సంవత్సరం డిసెంబర్ నాడు లక్ష 40వేల రూపాయలు అతని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. అంతేకాక తోటి మిత్రుని కుమార్తె వివాహము మంగళవారం నాడు జరగడంతో మిత్రులందరు కలిసి 40 వేలు ,సాటి మిత్రుడు రామ్మోహన్ రెడ్డి 30.వేలు రూపాయలు మొత్తం 70 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. తోటి మిత్రులు మేమున్నామని నీకేం కాదని ఆదుకోవడం ఆ కుటుంబాలలో ఆనందాన్ని నింపింది మొత్తానికి మండలంలోని విద్యార్థులు జిల్లాలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అనడంలో అతిశక్తి లేదు.. హాట్సాఫ్ స్నేహితుడా.

About Author