స్ఫూర్తిదాయకుడు… వాల్మీకి మహర్షి..
1 min readపల్లెవెలుగు వెబ్: వాల్మీకి జయంతి సందర్భంగా నగరంలోని బుధవారపేటలో 14వ వార్డులోని వైయస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామాయణాన్ని రచించి సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిన మహా మనిషి వాల్మీకి మహర్షి అని, ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం హర్షించదగ్గ విషయమని కో ఆప్షన్ మెంబర్ శ్రీరాములు అన్నారు. ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షి ఆదర్శ భావాలను దృష్టిలో పెట్టుకొని అడుగులు ముందుకు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కేదార్ నాథ్ మాట్లాడుతూ జగన్న ప్రభుత్వం వాల్మీకులను అభివృద్ధి పథకంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని అన్నారు. బోయవాడిగా ఉన్న వాల్మీకి మహర్షి అయ్యారని కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమలోని చెడు భావాలను వదిలిపెట్టి మంచి మనుషులం గా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు ఇన్చార్జ్ రెడ్డి మంజులత, శౌకథ్ అలి, బంకు రాముడు, శివ, కిరణ్, ఆమ్రూత్ తదితరులు పాల్గొన్నారు.