PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రధాని మోడీ స్ఫూర్తితో ఏలూరు పార్లమెంటు కు పోటి చేస్తాం…!

1 min read

రాజకీయాలంటే కొన్ని కుటుంబాలకేనా ఇతరులు పల్లకి మోయటమేనా..

కొల్లేరు వరుస పక్షులల రాజకీయ రాబందులు డబ్బు సంచులతో వస్తున్నారు. గెలిస్తే ఢిల్లీలో లేకుంటే అడ్రస్ ఉండదు

త్వరలో అందరి భాగస్వామ్యంతో 100 కోట్లతో ఏలూరు పార్లమెంటు డెవలప్మెంట్ ట్రస్ట్ ఏర్పాటు

10 కోట్లు ట్రస్ట్ కు ఇవ్వనున్నట్లు ప్రకటించిన గారపాటి చౌదరి   

ఏలూరులో గారపాటి చౌదరి ఆత్మీయ సమావేశానికి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు 

గారపాటి చౌదరికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన అభిమానులు    

పల్లె వెలుగు, ఏలూరు జిల్లా ప్రతినిధి : దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న స్వయం సేవకుడు ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో ఏలూరు జిల్లా అభివృద్ధితో ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా రాబోయే రోజులు ఒక స్వయం సేవకుడు గా  ఏలూరు పార్లమెంటుకు పోటీలో నిలబడబోతున్నా అని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. ఏలూరు బైపాస్ రోడ్ లోని క్రాంతి కళ్యాణ మండపంలో శుక్రవారం గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి గారపాటి చౌదరి అభిమానులు ఆత్మీయులు బిజెపి కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా తపన ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను అందిస్తున్నామని, తన కుటుంబమంతా సమాజ సేవకు అంకితం అవ్వాలనే నిర్ణయంతోనే తాను రాజకీయానికి వచ్చానన్నారు. కొల్లేరు కు వలస పక్షులు వచ్చినట్లుగా ఎన్నికల సమయంలో రాజకీయ రాబందులు వస్తాయి అని వలస పక్షులు డబ్బు సంచులతో వచ్చి గెలిస్తే ఢిల్లీలో ఉంటారు, ఓడితే అడ్రస్ ఉండరు అన్నారు.  ఏలూరు జిల్లా వాసుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్ లో నిలబడతా అని రెండు, మూడు రోజులు ఆలస్యమైనా విజయం తథ్యం అన్నారు. ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాము అన్నారు. కొవ్వలి రైతుబిడ్డ గా సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక స్వయం సేవకుడిగా క్రమశిక్షణ గల బిజెపి కార్యకర్తగా ఏలూరు పార్లమెంట్ పోటీలో నిలవనున్నానన్నారు.    రాబోయే రోజుల్లో ఏలూరు పార్లమెంట్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ఏర్పాటుచేసి అందరిని భాగస్వామ్యం చేసి 100 కోట్ల నిధి తో ఏలూరు జిల్లా అభివృద్ధి చేస్తామని, ఆ ట్రస్ట్ కు తన సంపాదన నుండి 10 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వబోతున్నాము అన్నారు. తాను జమీందారు కుటుంబం నుండి రాలేదు అని డబ్బులు ఎక్కువై, ఒళ్ళు బలిచి చేయట్లేదు అన్నారు. కేవలం సామాజిక స్పృహతో సేవ చేస్తున్నను అన్నారు.ఏలూరు జిల్లాలో చెందిన విద్యార్థులు చదువు పూర్తి అయి 10 వేల రూపాయల ఉద్యోగం కోసం హైదరాబాద్, బెంగుళూరు కు వెళ్లాల్సి వస్తోంది అని విద్యార్థులలో ఉన్న ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు ఏలూరు జిల్లాలో ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టబోతున్నాము అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను రాబోయే రోజుల్లో పూర్తి చేసేది ఏలూరు ఎంపీ యే అని గారపాటి చౌదరి అన్నారు. నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తు సనాతన ధర్మ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తున్న గారపాటి చౌదరి పార్లమెంట్ సభ్యుడు అయితే ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని తప్పనిసరిగా చౌదరి అఖండ మెజార్టీతో గెలుపొందారని ముండూరు శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ స్వామి శ్రీ కృష్ణ చరణా నంద స్వామీజీ అన్నారు. బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే అంబిక కృష్ణ మాట్లాడుతూ గెలిచే వ్యక్తి సేవ చేసే వ్యక్తి గారపాటి చౌదరికే ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఏలూరు ఎంపీ టికెట్ అన్నారు. పార్టీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని కార్యకర్తల నిర్ణయాలని గౌరవించాలన్నారు. ఎవరో మాయ మాటలు చెప్తే నమ్మొద్దని ఏలూరులో బిజెపికి పోటీ చేసి గెలిచే దమ్ము, క్యాడర్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డమణుగు సత్యనారాయణ న్యాయవాది, మురాల గోపీనాథ్,విజయవాడ ఆర్ ఎస్ ఎస్ సంచాలకులు కే దుర్గాప్రసాద్, బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిషోర్, ఏలూరు జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు, నారా శేషు, బిజెపి జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, గుమ్మడి చైతన్య, గోపాల్, మొడియం శ్రీనివాస్, గాది రాంబాబు, బొరగం  వెంకటలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

About Author