రాహుల్‌గాంధీ స్పూర్తితో.. సేవ
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు : యువనేత.. భావి ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్. కల్లూరులోని నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని శ్రీ సాయి వృద్ధాశ్రమంలో పండ్లు, బెడ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ.. నిరంతరం ప్రజల కోసం పని చేసే నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. సేవా కార్యక్రమాలు ఇంకా రెండు రోజులు కొనసాగుతాయని తెలియజేశారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు బాలస్వామి కాంగ్రెస్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు పఠాన్ అబీబ్‌ఖాన్, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు బోయ నాగరాజు, యువజన కాంగ్రెస్ నాయకులు విజయ్ యాదవ్ పాల్గొన్నారు.