PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీజీ వెంకటేష్​ స్ఫూర్తి.. యువతకు ఆదర్శం

1 min read

 ఆయన జన్మదినం సందర్భంగా  పలు సేవా కార్యక్రమాలు

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: నిరంతర అభివృద్ది శ్రామికుడు ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా కృషి చేసే గౌరవ రాజ్య సభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ జన్మదినం పురస్కరించుకుని ఆయన స్ఫూర్తితో కాపు యువ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాయలసీమ విద్యార్థి జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక కర్నూలు నగరంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు నిర్వహించిన ఈ రక్త దాన శిబిరాన్ని సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ మహేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.  ఈ రక్తదాన శిబిరంలో పలువురు విద్యార్థులు పాల్గొని రక్తదానం చేసి తమ స్ఫూర్తిని చాటి చెప్పారు. ఈ సందర్భంగా మహేష్, కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రక్త దాతలు నిజ జీవితంలో హీరోలని, రక్త దానం చేయడం వల్ల మనం  ప్రాణాలు కాపాడిన వారు అవుతామని అన్నారు. రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎండ కాలం కావటంతో రక్త నిల్వలు చాలా తక్కువగా ఉండటం, తలసేమియా భాదితులకు రక్తం అందించడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో రాయలసీమ విద్యార్థి జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు గారు సేవాతత్పరుడు టీజీ వెంకటేష్ స్ఫూర్తితో ముందుకు వచ్చి యువతను చైతన్యం చేసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్, రాయలసీమ విద్యార్థి జెఎసి నాయకులు దాసరి అశోక్, గిరి, రవీంద్ర, భరత్, కృష్ణ మూర్తి, శివ,  బాల రాజు, రవి, షఫీ, శ్రీనివాస రెడ్డి, రామ కృష్ణ తదితరులు పాల్గోన్నారు.

అవోపా ఆధ్వర్యంలో… శీతల పానీయం…

రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలను నగరంలోని రాజ్ విహార్ సెంటర్ లో అవోపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా రాజ్ విహార్ సెంటర్ లో ఎంపీ టీజీ వెంకటేష్  పుట్టినరోజును పురస్కరించుకొని బర్త్డే కేకు కట్ చేశారు. అనంతరం రాజవిహార సెంటర్ లో వాహనదారులకు వేసవి మండుటెండలు దృష్టిలో ఉంచుకొని శీతల పానీయాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఇల్లూరు లక్ష్మయ్య ,అవొపా సంస్థ ప్రతినిధులు యుగంధర్ శెట్టి, జవహర్ బాబు, శేషగిరి శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ టిజి వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు .అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడం టీజీవీ  కుటుంబానికి దక్కుతుందని వాడు వారు కొనియాడారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ,ఎంపీగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూల్ నగరాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేశారని చెప్పారు. భవిష్యత్తులో ఎంపీ టీజీ వెంకటేశ్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు.

 టీజీవీ ట్రేడ్​ యూనియన్​ నేతృత్వంలో…

టీజీవీ  ట్రేడ్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకొని టీజీవి ట్రేడ్ యూనియన్ 24 వ వార్షికోత్సవ వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని  రాజ్ విహార్ సెంటర్ లోని ఆటో స్టాండ్ వద్ద ఈ జీవి ట్రేడ్ యూనియన్ పతాకాన్ని యూనియన్  నాయకుడు బాలయ్య ఆవిష్కరించారు. అలాగే నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద టీజీవీ  ట్రేడ్ యూనియన్ 24 వ వార్షికోత్సవం తానుగా సందర్భంగా యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టి జి వీ ట్రేడ్ యూనియన్ నాయకులు బాలయ్య ,శేషగిరి శెట్టి మాట్లాడుతూ దేశంలోనే ప్రథమంగా ఒక వ్యాపారవేత్త ట్రేడ్ యూనియన్ స్థాపించిన ఘనత రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్కే  దక్కుతుందని చెప్పారు. గత నాలుగు సంవత్సరాలుగా తమ యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తుందని వివరించారు. తమ యూనియన్ కార్యకలాపాలకు ఆకర్షితులై నగరంలోని వివిధ విభాగాలకు చెందిన కార్మికులు యూనియన్లో సభ్యులుగా చేరు న్నారని చెప్పారు. యూనియన్లో సభ్యులుగా చేరేందుకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా నిరంతరం కార్మికుల సంక్షేమానికి టిజివీ ట్రేడ్  యూనియన్ కృషి చేస్తుందని వారు వివరించారు. భవిష్యత్తులో కూడా కార్మికుల సమస్యల పరిష్కారానికి తాము ఎంపీ టీజీ వెంకటేశ్ సహకారంతో కృషి చేస్తామని వారు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీ టిజి వెంకటేష్ కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి దశాబ్దాలుగా పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఆయన సహకారంతో ఎంతోమంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని వారు వివరించారు .కర్నూల్ నగరాన్ని క్రీడా నగరంగా తీర్చిదిద్దిన ఘనత ఎంపీ టిజి వెంకటేష్ కి దక్కుతుందని చెప్పారు.

About Author