PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భావితరాల స్ఫూర్తిప్రదాత.. జ్యోతిరావుపూలే : మాజీ మంత్రి ఆళ్లనాని

1 min read

పల్లె వెలుగు వెబ్​,ఏలూరు: అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన ధార్శనికుడు పూలే.సమానత్వం, స్వచ్చ, ఐక్య మత్యంతో కూడిన సమాజాన్ని ఆకాంక్షించిన జ్యోతిరావు పూలే.పురుషులతో పాటు స్త్రీలు కూడ సమానమేనని మహిళలకు విద్య అందించాలని సావిత్రి భాయికి విద్య నేర్పి భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా చేసిన ఘనత పూలేదేనన్నారు  ఏపి మాజీ డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని. జ్యోతిరావు ఫూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు ఫులే (1827 ఏప్రిల్ 11 – 1890 నవంబరు 28) ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త, మహారాష్ట్రకు చెందిన రచయితని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని పేర్కొన్నారు.జ్యోతిరావు ఫూలే కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడాని ఆళ్ల నాని చెప్పారు.జ్యోతిరావు ఫూలే భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు అని ఆళ్ల నాని తెలిపారు.ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు సోమవారం ఏలూరులోని మాజీ డిప్యూటీ సిఎం క్యాంప్ కార్యాలయంలో పూలే చిత్ర పటానికి పూల దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించి పూలే సేవలను రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని, ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్ కొనియాడారు.బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని ఆళ్ల నాని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారని అన్నారు. 1873 సెప్టెంబరు 24న , ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశారని ఆళ్ల నాని చెప్పారు. సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారాని ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్ తెలిపారు.జ్యోతిరావు ఫూలే, వారి భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులని ఆళ్ల నాని తెలిపారు.జ్యోతిరావు ఫూలే మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందారని ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్ చెప్పారు.ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848 లో పూనాలో ప్రారంభించారు.జ్యోతిరావు పులే వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించారని ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్ తెలిపారు.భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో పులే గారు ఉన్నారని ఆళ్ల నాని పేర్కొన్నారు.విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే అని ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెద్దబబు, డిప్యూటీ మేయర్ లు,నుకపెయ్యి సుధీర్ బాబు, జి శ్రీనివాస్,మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మంచెం మై బాబు,సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిల్లంగొల్లం శ్రీలక్ష్మీ, వైఎస్సార్సీపీ జిల్లా బీసీ అధ్యక్షులు  గంటా ప్రసాద్, ఏలూరు నగర అధ్యక్షులు బోద్దని శ్రీనివాస్, బీసీ నాయకులు నేరూసు చిరంజీవి, లక్కోజు గోపి,కిలాడీ దుర్గారావు, యుగందర్ ప్రసాద్ సాసుపల్లి,కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎమ్ ఆర్ పెద్దబాబు, మున్నుల జాన్ గురునాథ్, వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్ ఆర్ డి బలరాం,కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ తదితర కార్పొరేటర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

About Author