కంగనాకు ఇన్స్టాగ్రామ్ షాక్..!
1 min readపల్లెవెలుగు వెబ్: ట్విట్టర్ షాక్ నుంచి తేరుకోకముందే… బాలీవుడ్ నటి కంగనాకు మరో షాక్ తగిలింది. తనకు కరోన సోకిందని కంగన చేసిన పోస్టును ఇన్ట్సాగ్రామ్ డిలీట్ చేసింది. కరోనాను చిన్నపాటి ఫ్లూతో పోల్చిన కంగన పోస్టు మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కంగన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్స్టాగ్రామ్ తన పోస్ట్ డిలీట్ చేసిన అంశం మీద కంగన స్పందించారు. కరోనను నాశనం చేద్దామని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశానని, కానీ ఆ పోస్ట్ కొందరికి నచ్చలేదని కంగన్ విమర్శించారు. ట్విట్టర్ లో మాత్రమే కమ్యూనిస్టులు, ఉగ్రవాదుల సానుభూతిపరులు ఉంటారని అనుకున్నాను అంటూ స్పందించింది. ట్విట్టర్ ఇటీవల ఆమె అకౌంట్ ను తొలగించిన విషయం తెలిసిందే.