NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శిలాఫ‌ల‌కంపై మంత్రి ఫోటోకు బ‌దులు.. ఆయ‌న సోద‌రుడి ఫోటో !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తూర్పు గోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట మండ‌లం రాజ‌పూడిలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ర‌హ‌దారి నిర్మాణానికి ఉప‌ముఖ్యమంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్ శంకుస్థాప‌న చేశారు. శిలాఫ‌ల‌కం పై ఆయ‌న ఫోటోకు బ‌దులు.. ఆయ‌న సోద‌రుడు ధ‌ర్మాన ప్రసాద‌రావు ఫోటో ద‌ర్శన‌మిచ్చింది. దీంతో మంత్రితో పాటు మిగిలిన నాయ‌కులు కూడ ఆశ్చర్యానికి గుర‌య్యారు. గ‌తంలో ధ‌ర్మాన ప్రసాద‌రావు కూడ మంత్రిగా పని చేశారు. అయితే… అధికారులు చేసిన పనికి ఉప‌ముఖ్యమంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్ విస్మయానికి గుర‌య్యారు. ఇద్దరు సోద‌రులు మంత్రులుగా ప‌నిచేసినప్పటికి.. ఎవ‌రు ప్రస్తుత మంత్రి , ఎవ‌రు మాజీ మంత్రి ? అన్న తేడా తెలియ‌కుండా ఫోటోలు ముద్రించ‌డం పై ప‌లువురు స్థానికులు విమ‌ర్శించారు.

About Author