జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికై ఆర్డీవో కు ఆదేశాలు
1 min readపరిశీలనకు వస్తున్నాం కర్నూల్ ఆర్డీవో హరి ప్రసాద్ జర్నలిస్టులకు హామీ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ మండల పరిధిలోని జగన్నాథ గట్టు లో జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికై విచారించేందుకు కర్నూల్ ఆర్డీవో హరి ప్రసాద్ ను పరిశీలించేందుకు ఆదేశాలు ఇచ్చానని కర్నూలు జిల్లా కలెక్టర్ గుమ్మల సృజన చెప్పారని ఏపీజేఎఫ్ ఫోటో వీడియో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. ఈరోజు కర్నూల్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జగన్నాథ గట్టులో జర్నలిస్టుల ప్లాట్ లఅభివృద్ధి కొరకు నీటి వసతి, విద్యుత్ వసతి, రోడ్ల నిర్మాణం చేపట్టాలని జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీజేఏ ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఇచ్చిన ప్లాట్లలో అభివృద్ధికి నోచుకోవడం లేదని అక్రమణాలకు గురవుతుందని తక్షణమే చర్యలు తీసుకొని మంచినీటి వసతి కరెంటు వసతి రోడ్ల నిర్మాణం చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ గుమ్మల్ల సృజనని తులసి వినతి పత్రం అందజేయడంతో తక్షణమే స్పందిస్తూ కర్నూల్ ఆర్డీవో హరి ప్రసాద్ ను ఆదేశిస్తూ జగన్నాధ గట్టు జర్నలిస్టుల స్థలాలను పరిశీలించాలని కోరినట్లు చెప్పారు. కర్నూలు ఆర్డీవో హరి ప్రసాద్ స్పందిస్తూ జగన్నాధ గట్టు జర్నలిస్టుల ప్లాట్లను పరిశీలించేందుకు వస్తున్నామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టుల మధుసూదన్ రెడ్డి నజీర్ గంగాధర్ పాల్గొన్నారు .