ఉపాధ్యాయులను అవమానించడం తగదు: ఎస్టీయూ
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులను టాయిలెట్లు యూరినల్ ఫోటోలను అప్లోడ్ చేసి యాప్ ల ద్వారా పంపమని చెప్పడం వారిని అవమానించడమే అవుతుందని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ కొత్తపల్లి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పత్తికొండ ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఎస్ టి యు మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గా భావించి పూజించే మన దేశంలో ఉపాధ్యాయులకు ఇలాంటి స్థాయికి దిగజార్చిన ఘనత మన పాలకులకే దక్కిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయులకు పురమాయించిన ఇలాంటి పనులకు స్వస్తి పలకాలని కోరారు. ఉపాధ్యాయులకు మోపిన యాప్ ల మోత ను తగ్గించి బోధన కే పరిమితం చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టియు నాయకులు సుంకన్న, వెంకట్రాముడు, మధుస్వామి ,లక్ష్మీపతి, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.