బీమా సొమ్ము.. సకాలంలో అందించాలి
1 min read– బీమా మిత్రలను ఆదేశించిన డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు
పల్లెవెలుగు కర్నూలు: రాష్ట్రంలో రేషన్‌కార్డు కలిగిన కోటి 41లక్షల మంది కుటుంబాలలో యజమానికి వైఎస్సార్ బీమా పథకం వర్తింపజేస్తుందని వైకేపీ డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు తెలిపారు. యజమాని సహజ లేదా ప్రమాదవశాత్తు మరణంచిన, లేదా అంగవైకల్యం కలిగితే రూ.5 లక్షలు పొందేవిధంగా గతేడాది అక్టోబరు 21న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. వై.యస్.ఆర్ భీమ ప్రయోజనాలు సహజ మరణం, ప్రమాదం వల్ల మరణం లేదా శాశ్వత అంగ వైకల్యం జరిగినపుడు వై యస్ ఆర్ భీమ పథకం క్లెయిమ్స్ అప్ లోడింగ్ చేయునప్పుడు తీసుకోవలసిన జాగ్రతలపై భీమమిత్రలకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమములో ప్రజలకు వై.యస్.ఆర్ భీమ సొమ్ము సకాలంలో అందేవిధంగా ప్రతి ఒక్క భీమమిత్ర పని చేయాలని సూచించారు..ఈ శిక్షణ కార్యక్రమం నందు M.K.V. శ్రీనివాసులు, పథక సంచాలకులు, డి.ఆర్.డి.ఎ-వై.కే.పి అట్టుల్ రహిమాన్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, మరియు ఇ.శివ చెన్న రాయుడు, ఎ.పి.యం.(యస్.యస్ తదితరులు పాల్గొన్నారు.