సంపూర్ణ రితూ కవచ్ రబీ.. పథకంలో మామిడిపంటలో భీమా..
1 min readజిల్లా ఉద్యానవనల శాఖ అధికారి డాక్టర్:ఎస్ రామ్మోహన్ రావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : సంపూర్ణ రీతూ కవచ్ రబీ 2023-24 పధకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంత అగ్రికల్చర్ ఇన్సురెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (AIC) వారు మామిడి పంటకు భీమా అందిస్తున్నారని జిల్లా ఉద్యానవనాల శాఖాధికారి డా. ఎస్. రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో మన ఏలూరు జిల్లాలో ఉన్న రైతులకు కూడా మామిడి పంటలో నష్ట పరిహారాన్ని చెల్లిస్తారని, ఈ పథకంలో రైతులు కట్టవలసిన మరియు భీమా వివరాలు ఎకరానికి రైతులు చెల్లించవలసిన మొత్తము 1200/- మరియు 18% GST (మొత్తము 1416/-) రూపాయలు గాను ఎకరానికి 24000/- రూపాయలు భీమా చేయడం జరుగుతుందన్నారు. 15 డిసెంబర్, 2023 నుండి 31 మే 2024 సంవత్సర కాలము మధ్యన వర్షపాతము, ఉష్ణోగ్రత గాలిలో తేమ మరియు గాలి వేగములకు సంభందించిన పరిమాణాలను మండల స్థాయిలో గల APSDPS (ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ) వాతావరణ పరికరాల సహాయంతో లెక్కించి, దానిని ఈ పధకంలో ముందుగా పొందుపరచబడిన పరిమాణాలలో సరిపోల్చినప్పుడు వచ్చిన తేడా ఆధారంగా నష్ట పరిహారం చెల్లిస్తారన్నారు. ఏలూరు జిల్లాలో 37519.14 ఎకరాలు మామిడి పంటను సాగు చేస్తున్నారని, ఇందులో ఆగిరిపల్లి, నూజివీడు, చింతలపూడి, చాట్రాయి, లింగపాలెం మరియు ముసునూరు మండలాల్లో ఎక్కువ సాగుచేయ్యడం జరుగుతుందన్నారు. కావున రైతులు పథకం మరియు భీమా సమాచారం కోసం పైన ఉన్న మండల ఉద్యాన అధికారులను మరియు అగ్రికల్చర్ ఇన్సురన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (AIC) అధికారిని కల్పన ని (9618117844) సంప్రదించవలసిందిగా డా. రామ్మోహన్ కోరారు.