మాతృ భాషలోనే మేధో అభివృద్ధి
1 min readపల్లెవెలుగువెబ్ : మాతృ భాషలో విద్యా బోధన జరిగితే సాహిత్యం, విజ్ఞాన, సామాజిక శాస్త్రాల్లో మరింత మేధోభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. బడిలో పాఠాలు నేర్పిన గురువుల ప్రేమ, ప్రోత్సాహం వల్లే.. తమ గ్రామం నుంచి కాలేజీకి వెళ్లిన మొదటి బాలికగా నిలిచానని టీచర్ల సేవలను గుర్తు చేసుకున్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన జాతీయ టీచర్ల అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. 2022లో పాఠశాల విద్యలో ఉత్తమ సేవలందించిన 46 మంది టీచర్లకు జాతీయ అవార్డులు ప్రదానం చేశారు.