నిఘా విభాగం సోదాలు…
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది మండలంలో నిఘా విభాగం సోదాలు నిర్వహించినట్లు విశ్వాసనీయ సమాచారం. అనుమానిత వ్యక్తులకు సంబంధించి ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలిసింది. వారి వివరాలు ఆరా తీసినట్లు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల రీత్యా ప్రత్యేక నిఘా విభాగం సోదాలు చేసినట్లు తెలుస్తుంది. మండలంలోని వివిధ గ్రామాల్లో అనుమానితుల వివరాలు గోప్యంగా సేకరిస్తున్నట్లు సమాచారం. ఎన్నడూ లేని విధంగా మండలంలో నిఘా ప్రత్యేక విభాగం సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారడం ప్రాధాన్యత సంతరించుకున్నట్లు తెలుస్తుంది .అనుమానితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. సోదాలు కూడా అత్యంత రహస్యంగా చేపట్టినట్లు సమాచారం.