జిల్లాలో ఎండ తీవ్రత.. ఒంటి పూట తరగతులు వెంటనే ప్రకటించాలి
1 min read– PDSU జిల్లా అధ్యక్షులు S.M.D.రఫీ
– 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాసే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు రఫీ మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తేదీ నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రారంభమవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి హాల్ టికెట్ ఇవ్వాలి. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు మొత్తం చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని పద్ధతిలో విద్యార్థులను విద్యార్థులు తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నారు. అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకొని కచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి హాల్ టికెట్ అందే విధంగా చూడాలి. అదేవిధంగా పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో కూర్చోవడానికి బెంచీలు, త్రాగడానికి నీటి సదుపాయం, లైట్లు ఫ్యాన్లు వంటి వసతులు కల్పించాలని కోరుతున్నాం. గ్రామీణ ప్రాంత నుండి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేయాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందువలన తక్షణమే విద్యార్థులకు ఒంటి పుట తరగతులు నిర్వహించాలని కోరుతున్నాం.