గురుకులాల్లో మెరిసిన..ఇంటర్ ఆణిముత్యాలు
1 min read
నందికొట్కూరు, న్యూస్ నేడు: ఇంటర్ ఫలితాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాల విద్యార్థులు ఆణి ముత్యాల్లా మెరిశారు. శనివారం ఉ.11 గంటలకు ఇంటర్ ప్రథమ,ద్వితీయ ఫలితాలు విడుదల అయ్యాయి.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఉన్న బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు మంచి మార్కులతో ప్రతిభ కనబరిచారు.కళాశాల ప్రిన్సిపాల్ పీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం 96.36% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని 55 మంది విద్యార్థులకు గాను 53 మంది పాస్ అయ్యారు.హరీష్-980,హుశేని-976 మార్కులతో పాసయ్యారని ప్రథమ సంవత్సరంలో 71 మంది విద్యార్థులకు గాను 63 మంది పాసయ్యారు.డి సాయి మరియు సంజయ్-460, నవీన్-454 మాటలతో విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ తెలిపారు.అదేవిధంగా పగిడ్యాల మండలం లక్ష్మాపురం బాలికల గురుకుల కళాశాలలో 69 మంది విద్యార్థులకు గాను 68 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం ప్రతిభ కనబరిచారని ఆనంద జ్యోతి- 983,పి.నవ్య కళ-982 విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యారని ప్రిన్సిపాల్ వెంకట రమణమ్మ అన్నారు.అదే విధంగా మొదటి సంవత్సరంలో 68 కి గాను 66 మంది విద్యార్థులు పాస్ అయ్యారని ఆమె తెలిపారు.