16 నుంచి ఇంటర్ తరగతులు
1 min read
పల్లెవెలుగు వెబ్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 16 నుంచి తరగతులు జరగనున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైనా కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభించలేదు. ఇటీవల విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ దీనిపై సమీక్షించారు. 16న పాఠశాలలను ప్రారంభిస్తున్నందున ఇంటర్ తరగతులు కూడా అదేరోజు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆఫ్‌లైన్ తరగతులకు సిద్ధం కావాలని ప్రిన్సిపాళ్లకు నిర్దేశించారు.