మతాంతర వివాహం.. అబ్బాయి దారుణ హత్య
1 min readపల్లెవెలుగువెబ్ : ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ సిటీకి చెందిన దీపక్ బర్డె అనే హిందూ అబ్బాయిని దారుణంగా హత్య చేశారు. తొలుత అపహరించుకు వెళ్లి, ఆ తర్వాత హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని గోదావరిలోకి విసిరేశారు. ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు.