PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

31 నుంచి ఇంటర్మీడియేట్​ పబ్లిక్​ ప్రాక్టికల్​ పరీక్షలు

1 min read
మాట్లాడుతున్న కలెక్టర్​ జి. వీరపాండియన్​

మాట్లాడుతున్న కలెక్టర్​ జి. వీరపాండియన్​

  • మే 5 నుంచి థియరీ పరీక్షలు
    – ‘కోవిడ్’ నిబంధనలు తప్పనిసరి..
    – కలెక్టర్​ జి. వీరపాండియన్​
    పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జి.వీరపాండియన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ మిటింగ్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. ఉదయం 9:00 నుంచి 12:00 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు. అలాగే థియరీ పరీక్షలు మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయన్నారు.
    పరీక్షలు.. పకడ్బందీగా…
    జిల్లాలో 85 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ తోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు ఆదేశించారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తిలో ఉన్నందున కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ జి. వీరపాండియన్​ సూచించారు.
    ఎంపీసీ 13,770… బైపీసీ 10,444
    అంతకుమునుపు ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ ఆర్.సాలా బాయి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 85 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని.. ఎంపీసీ 13770 మంది విద్యార్థులు, బైపీసీ గ్రూప్ 10444 మంది విద్యార్థులు మొత్తం కలిపి జిల్లా వ్యాప్తంగా 24214 విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ పుల్లయ్య, ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ ఆర్.సాలా బాయి, డి ఎం హెచ్ ఓ రామ గిడ్డయ్య, ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం పి.వెంకట రామమ్, జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author