ఏపీలో 20 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం
1 min readపల్లెవెలుగువెబ్ : 20 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అందించేందుకు టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ సంస్థతో ఉన్నత విద్యామండలి ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు మంగళగిరిలోని మండలి కార్యాలయంలో ఒప్పంద పత్రంపై మండలి కార్యదర్శి నజీర్ అహ్మద్, టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ రీజనల్ హెడ్ రోహిత్ డోగ్రా సంతకాలు చేశారు. ఈ ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు ఉచితంగా అందిస్తారని, అసిస్టెన్స్ కావాలనుకునేవారు మాత్రం రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుందని మండలి కార్యదర్శి తెలిపారు. కార్యక్రమంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు పాల్గొన్నారు.