అందుబాటు ధరలో అంతర్జాతీయ స్థాయి విద్య…
1 min readహైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లకు శ్రీకారం చుట్టిన వేలాండ్ బాప్టిస్ట్ యూనివర్సిటీ
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : నాణ్యమైన విద్యాబోధన, నవతరానికి అవసరమైన కోర్సులను అందిస్తున్న అమెరికాలోని సుప్రసిద్ధ విశ్వవిద్యాలయం వేలాండ్ బాప్టిస్ట్ యూనివర్సిటీ మనదేశానికి తన సేవలను విస్తరించబోతోంది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ విద్యాలయం.. అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలన్న లక్ష్యసాధనలో భాగంగా హైదరాబాద్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించబోతోంది. భారతీయ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని విభిన్న సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. ఇందుకోసం శనివారం హైదరాబాద్‌లోని ఆదిత్య పార్క్‌లో సన్నాహక సమావేశం నిర్వహించింది. వేలాండ్ బాప్టిస్ట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ బాబీ హాల్, ఎన్‌రోల్‌మెంట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డేనియల్ బ్రౌన్, డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ ప్రాజెక్ట్స్,అలస్కా రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ డీన్ డాన్ యాష్లే, అకడమిక్ ఎఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ సిండీ మార్లో మెక్‌లెనగాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ విశ్వవిద్యాలయానికి విద్యా రంగంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు, యూనివర్సిటీ పరిధిలో అందిస్తున్న వివిధ గ్రాడ్యుయేట్, అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల గురించి వివరించారు. 1908లో స్థాపించబడిన వేలాండ్ బాప్టిస్ట్ విశ్వవిద్యాలయం గుణాత్మక, పరివర్తనాత్మక విద్యను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిందని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సేవలందిస్తోందని డాక్టర్ బాబీ హాల్ చెప్పారు. అధునాతన బిజినెస్ ఎడ్యుకేషన్‌ను అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్‌లకు ఏడాదికి కేవలం 14,250 డాలర్లు (సుమారు రూ.11లక్షల 81 వేల రూపాయలు) ఫీజుగా నిర్ణయించామని తెలిపారు. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో అందరికీ నాణ్యమైన విద్య అందడమే కాకుండా తమ విద్యావ్యవస్థలో సాంస్కృతిక వైవిధ్యాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నామన్నారు. టెక్సాస్‌లోని ప్లెయిన్‌వ్యూలో 116-సంవత్సరాల సమున్నత చరిత్ర కలిగిన వేలాండ్ బాప్టిస్ట్ విశ్వవిద్యాలయం ప్రాంగణంతో సహా మొత్తం ఆరుచోట్ల క్యాంపస్‌లున్నాయి. శక్తివంతమైన విద్య, సాంస్కృతిక వాతావరణంలో భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు ఇవి ఆహ్వానం పలుకుతున్నాయి. భారతీయ విద్యార్థులకు తమ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ యూనివర్సిటీ.. హైదరాబాద్‌లోని యూనివర్శిటీ హబ్‌ను అంతర్జాతీయ సేవా భాగస్వామిగా ఎంచుకుంది. ఈ విశ్వవిద్యాలయంలో ఐటీ, బిజినెస్ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాల ప్రక్రియ సులభతరం చేయడానికి తాము సహకరించనున్నట్లుయూనివర్శిటీ హబ్ వ్యవస్థాపకుడు డాక్టర్ అనిల్ పల్లా చెప్పారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఆదిత్య పార్క్ హోటల్‌లో ఈ నెల 28న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వివరాలకు 63871 49133 నంబర్‌లో సంప్రదించవచ్చు. విద్యార్థులు తల్లిదండ్రులు హాజరై వివిధ కోర్సులు, వాటికి సంబంధించిన ఫీజులు, ఇతర అంశాలపై విశ్వవిద్యాలయ ప్రతినిధులతో నేరుగా మాట్లాడవచ్చు.