ఘనంగా అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ శాఖ గ్రంధాలయంలో బుధవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శాఖ గ్రంధాలయ అధికారి రామ్ కుమార్ గ్రంథాలయ పాఠకులతో కలిసి తెలుగు తల్లి చిత్రపటానికి గ పూలమాలవేసి, తెలుగు తల్లిని సన్మానించారు. ఏ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంతంలో అర్థమయ్యే భాషలో మాట్లాడే భాష మాతృభాష అని గ్రంధాలయ శాఖ అధికారి రామ్ కుమార్ తెలిపారు.అలాగే మనకు పుట్టుకతో తల్లి మాట్లాడే భాష మనకు అలవాడే భాషను మనం మాతృభాషగా చెప్పుకోవచ్చని అన్నారు. అయితే మనకు మాతృభాష తెలుగు అవుతుందని మనము మాతృ మూర్తి తల్లికి ఎంతటి గౌరవిస్తామో, మన మాతృభాష తెలుగుకు అంత గౌరవం ఇవ్వాలని ఆయన సూచించారు. తెలుగు భాష గొప్పదనం గురించి కవులు రచయితలు మనకు పుస్తకంలో ఏనాడో తెలియజేశారని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అని కొనియాడారాని ఆయన గుర్తు చేశారు. కావున మనమందరం మాతృభాషపై ఎంతో గౌరవ భావన కలిగి ఉందామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠకులు నారాయణస్వామి, శివశంకర్, సురేంద్ర, మహేశ్వర్ రెడ్డి, డిగ్రీ కళాశాల విద్యార్థులు, లైబ్రరీ హెల్పర్ నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.