ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్నూరు: ఫిబ్రవరి 21వ తేదీ అనగా ఈరోజు ఉదయం 11 గంటలకు కళాశాల ప్రాంగణంలోని సెమినార్ హాలులో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ మహోత్సవం l ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు డాక్టర్ ఆర్ సునీత . సంచాలకులు డాక్టర్ ఎం అన్వర్ హుస్సేన్ . ఈ కార్యక్రమం ప్రభుత్వ డిగ్రీ కళాశాల & అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా కలిసి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ అలయన్స్ క్లబ్ సంస్థ ప్రధాన అధికారి డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా విచ్చేసి భాషలు మనిషి మనుగడకు , జాతి మనుగడకు ప్రాణం వంటివని మన మాతృ భాషలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని తెలియజేశారు. అతిథిగా కెవిఆర్ కళాశాల ఆంగ్ల అధ్యాపకులు మరియు అలయన్స్ క్లబ్ కర్నూలు జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్. ఎం. బాష హాజరై మాతృభాష మనోవిజ్ఞానానికి బాటలు వేయడానికి ఒక రహదారి లాంటివి అని దేశాభివృద్ధి మాతృభాషల అభివృద్ధిపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పారు.విశిష్ట అతిథిగా కె.వి.ఆర్ కళాశాల ఆంగ్ల అధ్యాపకురాలు డాక్టర్ ఫరీదా బేగం మాట్లాడుతూ అమ్మ నాన్న అనే పదాలు సజీవంగా బతికి ఉండాలంటే ,మన భాషల సంస్కృతి మనుగడ సాగించాలి అంటే మాతృభాష అంతం కాకుండా జాగ్రత్త పడాలని తెలియజేశారు.ఈ సందర్భంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచంలోని 120 దేశాల్లో సేవా కార్యక్రమాలను అందిస్తూ ప్రఖ్యాతి చెందిన అంతర్జాతీయ సంస్థ ASSOCIATION OF *ALLIANCE CLUBS INTERNATIONAL ఉత్తమ సేవా పురస్కారాలు భాషకు సేవ చేసిన కొంతమంది అధ్యాపకులకు ,విద్యార్థులకు అందజేశారు (AWARDS presentation programme) .కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ సునీతకి మాతృభాషలను ప్రోత్సహించే ఉత్తమ ప్రిన్సిపాల్ గా రాయలసీమ జోన్లో అవార్డు అలయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు చేతుల మీదుగా స్వీకరించారు. అలాగే భాషకు సేవ అందించిన డాక్టర్ ఎం అన్వర్ హుస్సేన్ కు ఉత్తమ తెలుగు భాష సేవకులుగా, ఆంగ్ల భాషకు సేవనందించిన డాక్టర్ ఎస్ ఎం భాషకు ఉత్తమ ఆంగ్ల భాష సేవకులుగా, పాణ్యం ఆంగ్ల ధ్యాపకురాలు డాక్టర్ ఫరీదా వేగంకి ఉత్తమ ఆంగ్ల భాష సేవకురాలిగా, హిందీ అధ్యాపకులు కే ఖాజా హుస్సేన్ కు ఉత్తమ హిందీ భాషా సేవకులుగా, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ తాజుద్దీన్ కు ఉత్తమ విద్యా సేవకుడిగా, రాజనీతి శాస్త్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ రఘుపతి రెడ్డి కు ఉత్తమ విద్యా సేవకుడిగా, తెలుగు ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం చూపించిన కొంతమంది విద్యార్థులకు అభినందన అవార్డులను అందించారు.ఈ సందర్భాన్ని పరిష్కరించుకుని కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ సునీత ప్రతి ఒక్కరు మాతృభాషల్లో ప్రావీణ్యం సంపాదించి తద్వారా విజయ శిఖరాలను అందుకుని తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టాలని కోరారు తమకు పురస్కారాలు అందించిన ఇంటర్నేషనల్ క్లబ్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారుముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు కి డాక్టర్ కి డాక్టర్ సమీరా బేగం కి ప్రిన్సిపాల్ తమ కళాశాల తరఫున ఘనంగా సన్మానించారు.