ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
1 min read
పల్లెవెలుగు, కర్నూలు: స్థానిక శంకరాస్ డిగ్రీ కళాశాల నందు ఘనంగాఅంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్. ఎం. అన్వర్ హుస్సేన్ పాల్గొని తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు భాషలో ఉండే తీయదనాన్ని, ప్రపంచంలోని భాషలన్నింటిలో తెలుగు స్థానాన్ని తెలియజేస్తూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ప్రాధాన్యాన్నివిద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలోకళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్ మద్దిలేటి కళాశాల తెలుగు అధ్యాపకులు మద్దయ్య ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది.
