అంతర్జాతీయ నర్సుల దినోత్సవ కార్యక్రమం
1 min read
ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హల్ నందు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారనీ మరియు వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన “ఫ్లోరెన్స్ నైటింగేల్ ” పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు అని అన్నారు.ఆసుపత్రి నందు డాక్టర్స్తోపాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివనీ అన్నారు . అనంతరం ” ఫ్లోరెన్స్ నైటింగేల్ “విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోడుమూరు శాసన సభ సభ్యులు శ్రీ బొగ్గుల దస్తగిరి గారు మాట్లాడుతూ:– ఆసుపత్రి నందు సేవ చేస్తున్న నర్సులు నిజంగానే సేవాముర్తులు.. ఆసుపత్రి నందు పేషెంట్లు చికిత్స చేయండి అని చేరిన నాటి నుంచి కోలుకొని తిరిగి వెళ్ళేవరకు వెన్నంటే ఉండి వారు సేవలు చేస్తారు. అనుక్షణం నర్స్, సిస్టర్ అంటూ పిలిచినా విసుగు చెందకుండ వస్తారు అని అన్నారు.డాక్టర్లకు, ఇటు రోగులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ స్వీయ రక్షణతోపాటు… బాధితులను కూడా రక్షించేందుకు పాటుపడుతున్నారు. ఇంతటి సేవ చేస్తూ ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కోంటూ.. వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి దూరంగా ఉంటూ ఈ కష్ట కాలంలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క నర్సుకు మనస్పూర్తిగా ధన్యవాదలు తెలిపారు.ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.శ్రీరాములు, నర్సింగ్ సూపరింటెండెంట్, సావిత్రిబాయి, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రే2, విమలమ్మ, ఏపీ ఎన్జీవో ప్రెసిడెంట్, సి హెచ్. వెంగల్ రెడ్డి, నర్సింగ్ సిబ్బంది తదితరులు, తదితరులు పాల్గొన్నారు.