‘అంతర్జాతీయ ఉపాధ్యాయ సమాఖ్య వర్చ్యువల్ ’లో మహిళా ఉపాధ్యాయులు పాల్గొనండి
1 min readపల్లెవెలుగు వెబ్: మహిళా సాధికారత ,విద్య మరియు అన్నిరంగాల్లో మహిళలకు సమాన ప్రాధాన్యత అనే అంశం పై అంతర్జాతీయ ఉపాద్యాయ సమాఖ్య , మరియు దాని భాగస్వామి అయిన అఖిల భారత ప్రాథమిక ఉపాద్యాయ సమాఖ్య (AIPTF) ఆధ్వర్యంలో రాబోయే జూన్ 13 నుంచి 16 వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా వర్చ్యువల్ సమావేశం జరుగుతుంది అని అందులో మన రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో మహిళా ఉపాద్యాయినులు పాల్గొని తమ సలహాలు సూచనలు అందించి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాద్యాయ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షరాలు శ్రీమతి ఎ.పద్మావతి , ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఎస్. వి .ఎస్. ఎల్ పూర్ణిమ గారు , మరియు రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీమతి మనోఙ్ఞ గార్లు సంయుక్త ప్రకటనలో కోరారు ,ఈ సమావేశంలో పాల్గొనదలచిన వారు https://events.ei.ie.org/WWC4 లింక్ ద్వారా తమ వివరాలు నమోదుచేసుకోవాలని కోరారు, ఈ నమోదు కార్యక్రమం ఈరోజు నుంచి జూన్ 10 వ తేదీ వరకు చేసుకోవచ్చు నని వారు తెలియజేసారు , కావున ఆంధ్రప్రదేశ్ లోని మహిళా ఉపాద్యాయినులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహిళా సాధికారత కు తమ అమూల్యమైన సూచనలు అందించగలరని అప్తా మహిళ నాయకురాళ్లు ఒక సంయుక్త ప్రకటన లో మహిళా ఉపాధ్యాయులను కోరారు.