మహిళలు,బాలికల హక్కులను రక్షించే లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
1 min read
ఏలూరులో ఉత్సాహపూరిత వాతావరణంలో 2 కె మారథాన్
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జెసి పి. ధాత్రిరెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, బాలికల హక్కులను రక్షించే లక్ష్యంగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025 కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఏలూరులో నిర్వహించిన 2 కె మారథాన్ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జెండాఊపి ప్రారంభించారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్ వరకు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగిన 2 కె మారథాన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డి ఎస్ పి శ్రావణ కుమార్, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు, సెట్ వెల్ సిఇఓ ప్రభాకరరావు, ఐసిడిఎస్ పిడి పి.శారద, డిసిపివో డా. సూర్యచక్రవేణి, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు వి. శ్రీలక్ష్మి, డిఇఓ వెంకటలక్ష్మమ్మలతో పాటు పెద్దఎత్తున వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు, మహిళలు,బాల బాలికలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే ఈరోజు 2కె మారథాన్ నిర్వహించుకున్నామన్నారు. ఈనెల 8వ తేదీన సర్. సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందరికీ హక్కులు,సమానత్వం, మహిళా సాధికారాత పై చైతన్య పరచడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. సమాజంలోని ప్రతిఒక్కరూ మహిళా అభివృద్ధికి పూర్తిసహకారం అందించాలన్నారు. ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమన్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా మహిళల విజయాలు గుర్తించి వారిని సత్కరించడం జరుగుతుందన్నారు.